: మొదట నీ వేషధారణ చూసుకో.. యాంకర్ అనసూయపై ‘అర్జున్ రెడ్డి’ అభిమానుల ఆగ్రహం
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అమ్మను ఉద్దేశించి చెప్పే డైలాగులపై యాంకర్ అనసూయ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఓ మహిళను రాయలేని పదాలతో తిట్టడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, అనసూయపై అర్జున్ రెడ్డి సినిమా అభిమానులు మండిపడుతున్నారు. అనసూయకే బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి గురించి ఉన్న వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపేముందు అనసూయ కూడా ఒక తల్లేనని, మొదట తల్లి అయిన అనసూయ తన వేషధారణ మార్చుకోవాలని అన్నారు.
నీతి వ్యాఖ్యలు ఎవరైనా చెబుతారని ఆచరించి చూపించాలని ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవలే కొందరు నెటిజన్లు అనసూయ వేసుకునే డ్రెస్ పై కామెంట్లు చేయడంతో ఆమె మండిపడిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి డైలాగులపై ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ, ఆమె వేషధారణ మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఆమె మొదట తాను యాంకరింగ్ చేస్తోన్న జబర్దస్త్ షోపై మండిపడాలని నెటిజన్లు అంటున్నారు.