: బరువు తగ్గడం ఇష్టం లేక, అందాల కిరీటాన్ని వెనక్కిచ్చేసిన యూకే సుందరి
అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలకు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలంటే బరువు తగ్గక తప్పదని నిర్వాహకులు స్పష్టం చేసిన వేళ, తనకు జాతీయ సుందరి కిరీటమే అక్కర్లేదని వెనక్కిచ్చేసిందో అందాల భామ. మిస్ యునైటెడ్ కింగ్ డమ్ గా నిలిచిన జోయీ స్మాలీ, తాను గెలుచుకున్న కిరీటాన్ని వదులుకుంది.
ఈ సంవత్సరం ఆమె యూకే తరఫున మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ పోటీల్లో పాల్గొనాల్సి వుండగా, కాస్తంత బరువు అధికంగా ఉండటంతో డైటింగ్ చేసి బరువు తగ్గాలని ఆమెను అడిగారు. తన శరీరాకృతిని మార్చుకోవడం ఇష్టంలేని ఆమె, మిస్ యూకే గౌరవం తనకు వద్దని తేల్చి చెప్పింది. 'డెయిలీ మెయిల్' దినపత్రికతో మాట్లాడిన ఆమె, ఈక్వెడార్ లో సెప్టెంబర్ లో జరిగే పోటీల్లో పాల్గొనాలంటే, తాను బరువు తగ్గాలని తేల్చి చెప్పారని, అది తనకు ఇష్టం లేదని పేర్కొంది.