: 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ కు ఫేస్ బుక్ లైవ్ లో ఊహించని ప్రశ్న... ఛఛ అలాంటిదేమీ లేదన్న షాలినీ పాండే


'అర్జున్ రెడ్డి' సినిమా ఎన్ని వివాదాల్లో చిక్కుకుందో... అదే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సూపర్ సక్సెస్ ఆనందంలో చిత్ర యూనిట్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండే ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చింది. అందులో ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది.

 ‘‘ఈ సినిమాలో హీరోతో మీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది కదా, మీరిద్దరూ నిజంగానే లవ్‌ లో ఉన్నారా?’’ అని ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి ఆమె గడుసుగా సమాధానం చెబుతూ, ‘‘అలాంటిదేమీ లేదు. మేమిద్దరం... అంటే విజయ్ దేవరకొండ, షాలినీ లవ్ చేసుకోలేదు. సినిమాలో ప్రీతి, అర్జున్ లు మాత్రమే లవ్ చేసుకున్నారు. వాళ్ల లవ్ బలమైనది కాబట్టే వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా అంత బాగా వర్కవుట్ అయింది’’ అంటూ చెప్పింది. ఈ సమాధానంతో అభిమాని ఏకీభవించాడు. 

  • Loading...

More Telugu News