: రాంపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేటీఆర్
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఘట్‌కేసర్ పరిధిలోని రాంపల్లి వద్ద 6200కి పైగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ మార్కును జీహెచ్ఎంసీ చేరుకుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇందుకోసం సంవత్సర కాలంలో రూ. 8500 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి బృహత్తర ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టడం దేశంలోనే మొదటిదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు స్థానిక అధికార్లు, ఇంజినీర్లు పాల్గొన్నారు.