: జంతువులతో ఇక ఆటలు కుదరవు.. తొలిసారి చట్టం చేసిన లెబనాన్!


లెబనాన్ ప్రభుత్వం తొలిసారి జంతు సంక్షరణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అధ్యక్షుడు మైఖేల్ అవోన్ తొట్టతొలి జంతు సంరక్షణ బిల్లుపై సంతకం చేసి చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం పెంపుడు, అటవీ జంతువులకు రక్షణ లభిస్తుంది. వాటికి ఎవరైనా హాని తలపెడితే జైలుకు పంపుతారు. పెంపుడు జంతువులు, జైలులోని  జంతువులు, ఆహారంగా ఇంటిలో వండుకునే జంతువుల విషయంలో ఈ చట్టం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని ఉల్లంఘించిన వారికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తారు.

లెబనాన్‌లో జంతువుల వ్యాపారం పెద్దఎత్తున పెరిగిపోవడంతో ప్రభుత్వం ఈ చట్టం చేసింది. పులులు, సింహాల విక్రయం దేశంలో బాగా పెరిగింది. సర్కస్‌లలో వాటితో ప్రదర్శనలు పెరిగాయి. ఈ క్రమంలో అవి హింసకు గురవుతున్నాయి. కొందరు వాటిని పెంచుకోవడం స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. ఈ క్రమంలో జంతు సంరక్షణ కోసం చట్టాన్ని తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News