: గర్వించదగ్గ క్షణం.. స్వదేశీ స్నైపర్లు రెడీ.. ఇకపై కమెండోల చేతుల్లో మెరవనున్న కొత్త స్నైపర్లు


శాంతి భద్రతలు, సరిహద్దుల్లో రక్షణ వంటి విషయాల్లో విదేశీ ఆయుధాలపై ఆధారపడడాన్ని భారత్ తగ్గిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలను వృద్ధిచేసుకుంటూ వస్తోంది. పశ్చిమబెంగాల్ లోని ఈశాపూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఏడాది పాటు తీవ్రంగా శ్రమించి, సరికొత్త స్నైపర్స్ ను తయారు చేశారు. ఇప్పటి వరకు దేశ రక్షణకు మన కమెండోలు విదేశీ స్నైపర్లను వినియోగించేవారు.

 తాజాగా, ఏళ్లుగా వాడుతున్న విదేశీ స్నైపర్ల స్థానంలో స్వదేశీ స్నైపర్‌ రైఫిళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. కోల్ కతా పోలీసులకు వీటిని అందజేసి పరీక్షించనున్నారు. త్వరలోనే ఆ రాష్ట్ర కమెండోలకు వీటిని అందజేస్తారు. వీటి కోసం సీఆర్పీఎఫ్‌, హర్యాణా, రాజస్థాన్‌ పోలీసు శాఖల నుంచి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీకి ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో వీటిని పెద్ద ఎత్తున తయారు చేయనున్నారు. వీటి సామర్థ్యం వివరాల్లోకి వెళ్తే... 7.62 మిల్లీ మీటర్ల రైఫిల్‌ బరువు 6.7 కిలోలు. 800 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. దీని ధర 2.5 లక్షల రూపాయలు. దీనికి జీఎస్టీ, ఇతర పన్నులు అదనం. 

  • Loading...

More Telugu News