: సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు.. డిసెంబరు 31తో ఆఖరు


సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఇక నుంచి వాటిని పొందాలంటే ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన ప్రభుత్వం గడువును మరో మూడు నెలలు పొడిగించింది. సెప్టెంబరు 30తో గడువు ముగియనుండగా దానిని డిసెంబరు 31కి మార్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ అనుసంధానం గోప్యతా హక్కును హరించడమేని ఇటీవల సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆధార్‌ అనుసంధానంపై కోర్టులో దాఖలైన పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

 ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనానికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు సమాచారం ఇచ్చారు. కాగా, సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానాన్ని పొడిగించడం ఇది రెండోసారి. గతంలో జూన్ 30 ని డెడ్‌లైన్‌గా ప్రకటించగా ఆ తర్వాత దానిని సెప్టెంబరు 30కి పెంచింది. తాజాగా డిసెంబరు 31కి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News