: ఇరవై ఏళ్ల తర్వాత కాకినాడలో టీడీపీ జెండా ఎగరబోతోంది: మంత్రి ప్రత్తిపాటి


ఇరవై ఏళ్ల తర్వాత కాకినాడలో టీడీపీ జెండా ఎగరబోతోందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 38 నుంచి 40 స్థానాల్లో టీడీపీ-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని, వైసీపీ సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని, ఈ ఎన్నికలు వైసీపీకి గుణపాఠం నేర్పుతాయని అన్నారు. వాళ్ల చొక్కాలు ఊడదీస్తాము, వీళ్ల నిక్కర్లు ఊడదీస్తామంటూ తన ఇష్టానుసారం మాట్లాడిన జగన్ బట్టలను నంద్యాల ఓటర్లే ఊడదీశారని, తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు.

  • Loading...

More Telugu News