: పీవీ సింధుకి ప్రత్యేక కానుకలు అందజేసిన కేసీఆర్, కేటీఆర్
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకాన్ని సాధించిన పీవీ సింధు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసింది. ఈ సందర్భంగా సింధుని కేసీఆర్ అభినందించి పుష్పగుచ్ఛం అందజేసినట్టు మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. అనంతరం, పీవీ సింధుకి మంత్రి కేటీఆర్ ప్రత్యేక కానుకలు అందజేశారు. చేనేత శాలువాలతో పాటు ప్రత్యేకంగా నేయించి తీసుకొచ్చిన పోచంపల్లి చీరలను, వెండి జ్ఞాపికను కేసీఆర్, కేటీఆర్ కలిసి సింధుకి అందజేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ ని కూడా కేసీఆర్ సత్కరించారు.