: అన్నా! ట్విటర్లో కూడా ‘తాతయ్య’ను వదలిపెట్టకు అన్నా: విజయ్ దేవరకొండకు ఓ అభిమాని పోస్ట్


‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ తన ‘ట్విటర్’ ఖాతాను ఈరోజు ప్రారంభించిన విషయాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపాడు. వెంటనే, స్పందించిన ఆయన అభిమానులు రిప్లై ఇచ్చారు. ‘ట్విటర్’లో ఖాతా తెరిచినందుకు అభినందించిన అభిమానులు, ముఖ్యంగా, ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ సినిమాలో విజయ్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

 ఈ చిత్రాన్ని ముంబైలో మొదట విడుదల చేస్తే బాగుండేదని, హిందీ భాషలోకి డబ్బింగ్ చేయాలని అభిమానులు అభిప్రాయపడ్డారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా విజయ్ దేవరకొండ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్స్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అభిమానుల్లో ఒకరు ‘‘ట్విటర్’ లో కూడా ‘తాతయ్య’ను వదలిపెట్టకు అన్నా..’, ‘ట్విటర్’ ఖాతా ఎందుకు భయ్యా ‘తాతయ్య’ కోసమా?? తాతయ్యా చిల్’ అంటూ పోస్ట్స్ చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News