: ఎమ్మెల్సీగా పోటీ చేయనున్న యోగి ఆదిత్యానాథ్!
ఈ ఏడాది మార్చి 19న యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణం చేసిన విషయం విదితమే. అప్పటికే ఎంపీ గా ఉన్న యోగి ఇటీవల తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల్లోగా యూపీ అసెంబ్లీకి ఆయన ఎన్నిక కావాల్సి ఉంది. అయితే, అసెంబ్లీకి కాకుండా కౌన్సిల్ కి ఆయన పోటీ చేయనున్నారు. సెప్టెంబర్ 18న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
యోగితో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, మరో ఇద్దరు మంత్రులు స్వతంత్ర దేవ్, మోహ్ సిన్ రజా కూడా కౌన్సిల్ కే పోటీ చేయనున్నారు. దీంతో, యూపీలోని ఏ బీజేపీ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కాగా, సమాజ్ వాది పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్సీలు, బీఎస్పీ నుంచి ఒక ఎమ్మెల్సీ తమ పదవులకు ఇటీవల రాజీనామా చేశారు.