: వైఎస్ జగన్ గొప్ప వ్యక్తి.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసుకోండి!: ఎమ్మెల్యే రోజా


వైసీపీ అధినేత జగన్ గురించి  ప్రజల్లో ఉన్న వ్యతిరేక అభిప్రాయాలు తప్పని, ఆ అభిప్రాయాలను ప్రజల్లో చొప్పించింది టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలేనని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ నేపథ్యంలో తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. జనగ్ ని ఓ దుర్మార్గుడిగా, అవినీతిపరుడిగా ఆ వార్తా ఛానెల్స్ చూపించాయని, కళ్లకు ఏది కనిపించిందో, చెవులకు ఏది వినిపించిందో ప్రజలు అదే నమ్మారని అన్నారు.

జగన్ పై సానుకూల దృక్ఫథం కలిగేలా ఆయా వార్తా ఛానెల్స్ చూపించని కొన్ని విషయాలను మాత్రం తాను చెప్పదలచుకున్నానని రోజా అన్నారు. తన ఫేస్ బుక్ ఫాలోవర్లలో వేలాది మంది రాజకీయాలకు సంబంధంలేని వారు ఉన్నారని, వారి కోసం జగన్ గురించి కొన్ని విషయాలను విన్నవించుకుంటున్నానని అన్నారు. రోజా ప్రస్తావించిన విషయాల్లో కొన్ని...

* జగన్ ఒక విషయాన్ని విశ్లేషించి నిర్ణయానికి వచ్చాక, ప్రాణం పోతుంది అనుకున్నా మడమ తిప్పడు
* వైఎస్ఆర్ ని అభిమానించే వారి కోసం సోనియాని ఎదిరించి జైలు శిక్ష అనుభవించాడు
* కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసినా మాట తప్పకూడదు అనే నియమంతో అభ్యర్థులను మార్చలేదు...
* భారతదేశంలోనే ముందస్తు పన్ను చెల్లించిన ఏకైక వ్యక్తి జగన్ అంటూ ఆయనకు సంబంధించిన పలు పాజిటివ్ పాయింట్లను      రోజా ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News