: దినకరన్ కు షాకిచ్చిన తమిళనాడు గవర్నర్!
అన్నాడీఎంకే తిరుగుబాటు నేత దినకరన్ కు తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు షాకిచ్చారు. 19 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం ద్వారా పళనిస్వామి, పన్నీర్ సెల్వంల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు దినకరన్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, అసెంబ్లీలో బల నిరూపణకు ఆదేశించాలంటూ గవర్నర్ ను ఆయన కోరారు.
అయితే, దినకరన్ విజ్ఞప్తిని గవర్నర్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలంతా ఇంకా అన్నాడీఎంకే పార్టీలోనే కొనసాగుతున్నారని, ఈ తరుణంలో బల నిరూపణకు తాను ఆదేశించలేనంటూ విద్యాసాగర్ రావు స్పష్టం చేసినట్టు 'విదుదలై చిరుతైగల్ కట్చి' నేత తురుమవల్లవన్ తెలిపారు.