: మద్యం తాగి కాలేజీకి వచ్చిన బీటెక్ విద్యార్థి.. లెక్చరర్లు తిట్టారని ఆత్మహత్య!
మద్యం తాగి కాలేజీకి వెళ్లిన ఓ విద్యార్థిని గుర్తించిన లెక్చలర్లు అతడిని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు విద్యార్థి అక్కడి నుంచి తన సొంత ఊరు అయిన తెనాలికి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురంలోని స్వర్ణాంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న మణికంఠ ఈ ఘటనకు పాల్పడ్డాడు. మద్యం తాగి రావడంతో మరోసారి ఇలా చేస్తే టీసీ ఇచ్చి పంపిస్తామని ఆ కాలేజీ యజమాన్యం అతడిని హెచ్చరించినట్లు తెలుస్తోంది.