: నాపై ఓ కేసు కొట్టేశారు... ఇంకో ఆరున్నాయి: కేటీఆర్
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తనపై నమోదైన కేసుల్లో ఒకటి కొట్టివేశారని ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రైల్ రోకో చేసినందుకు తనపై కేసు నమోదైందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, దీన్ని కొట్టివేస్తూ, రైల్వే కోర్టు తుది తీర్పును ఇచ్చిందని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన న్యాయవాదులు తెలిపారని, ఇంకా తనపై మరో ఆరు కేసులు విచారణ దశలో ఉన్నాయని, వీటి నుంచి కూడా బయటపడతానన్ననమ్మకం ఉందని అన్నారు. కేసు కొట్టివేతపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.