: కత్తి మహేష్ ను వెనకేసుకొచ్చిన యాంకర్ కత్తి కార్తీక!
తనదైన తెలంగాణ యాసతో టీవీ షోలు చేస్తూ, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కత్తి కార్తీక, 43 రోజుల పాటు 'బిగ్ బాస్' హౌస్ లో గడిపి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తరువాత ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, కత్తి మహేష్ ను వెనకేసుకొచ్చింది. ఏది మాట్లాడినా మహేష్ ఎంతో ఆలోచించిన మీదటే మాట్లాడతాడని కితాబిచ్చింది. అతను తనకు సోదరుడి వంటి వాడని, అంత కూల్ గా ఉండే వ్యక్తిని తానింతవరకూ చూడలేదని చెప్పింది.
మహేష్ తో తాను మంచిగా ఉండేదాన్నని, అయితే, ఓ పని మాత్రం తనకు నచ్చలేదని చెప్పింది. ముమైత్, సమీర్ గొడవ పడుతుంటే, మహేష్ బయటకు వెళ్లి కూర్చుండిపోయాడని, ఈ విషయంలో తనకు కోపం వచ్చిందని తెలిపింది. ఈ హౌస్ కు రాకముందు కత్తి మహేష్ అంటే ఎవరో తెలియదని, వచ్చిన తరవాత తనకెంతో సన్నిహితుడు అయ్యాడని కార్తీక చెప్పుకొచ్చింది. కాగా, ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కత్తి మహేష్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.