: యూట్యూబ్లో రికార్డులను తిరగరాస్తున్న టేలర్ స్విఫ్ట్ కొత్త ఆల్బం!
ఇంగ్లీష్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కొత్త మ్యూజిక్ వీడియో `లుక్ వాట్ యూ మేడ్ మీ డూ` యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 43 మిలియన్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. యూట్యూబ్ చరిత్రలో అప్లోడ్ చేసిన రోజునే అతి ఎక్కువ వ్యూస్ సంపాదించిన వీడియోగా టేలర్ స్విఫ్ట్ వీడియో నిలిచినట్టు యూట్యూబ్ ప్రకటించింది. గంగ్నమ్ స్టైల్ సింగర్ సై అప్లోడ్ చేసిన `జెంటిల్మేన్` పాటకు ఒక్కరోజులోనే 36 మిలియన్ల వ్యూస్ వచ్చిన రికార్డును టేలర్ తిరగరాసింది.
గత పదేళ్లుగా తనను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా కించపరిచిన వారిని ఉద్దేశిస్తూ టేలర్ ఈ వీడియో రూపొందించింది. ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డుల వేడుకలో ఈ వీడియోను విడుదల చేశారు. విచిత్రమేంటంటే... ఈ వేడుకకు టేలర్ హాజరు కాలేదు. మొదటిరోజు నిమిషానికి సరాసరిన 30 వేల మంది ఈ వీడియోను వీక్షించారని యూట్యూబ్ పేర్కొంది.