: భర్తను ఛీకొట్టి పోలీసు కేసు పెట్టిన భార్య... స్టేషన్ లోనే అలకతీర్చి అక్కున చేర్చుకున్న భర్త... వైరల్ వీడియో!
భర్తతో పడలేక, ఛీకొట్టి వెళ్లిపోయిన ఓ యువతి అతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, స్టేషన్ కు వెళ్లిన సదరు భర్త, భార్య అలక తీర్చి, లాలించి, అక్కున చేర్చుకున్న వీడియో ఒకటిప్పుడు వైరల్ అవుతోంది. యూపీలోని ఝాన్సీలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, తామందుకున్న ఫిర్యాదుపై ఓ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నిర్ణయించుకున్న పోలీసులు ఇద్దరినీ పిలిపించారు.
ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు కూడా సదరు యువతి భర్తపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆమె కోపాన్ని చల్లార్చాలని నిర్ణయించుకున్న ఆ భర్త తన మధురమైన గానాస్త్రాన్ని బయటకు తీశాడు. 'బద్లాపూర్' చిత్రంలోని 'జినా.. జినా...' అంటూ పాటందుకున్నారు. దీంతో కరిగిపోయిన ఆయన భార్య కన్నీరు పెట్టుకుంటూ వచ్చిన భర్త అక్కున చేరిపోయింది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.