: ఇండిగో విమానాన్ని ఢీకొన్న గద్ద... విశాఖలో తప్పిన పెను ప్రమాదం
ఈ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. 8 గంటలకు విశాఖ నుంచి బెంగళూరుకు బయలుదేరేందుకు విమానం టేకాఫ్ తీసుకుంటుండగా, ప్రొపెల్లర్ ను ఓ గద్ద ఢీకొంది. దీంతో సాంకేతిక సమస్య ఏర్పడటంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని సురక్షితంగా నిలిపేశారు. విమానం ఇంజన్ కు మరమ్మతులు చేయాల్సి వుందని చెబుతూ సర్వీస్ ను రద్దు చేస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది. ఈ ఘటనతో సుమారు 100 మందికి పైగా బెంగళూరు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.