: ఎగువన భారీ వర్షాలు... గోదావరికి పెను వరద ముప్పు
గోదావరికి క్యాచ్ మెంట్ ఏరియాగా ఉన్న మహారాష్ట్రలోని నాసిక్, అహ్మద్ నగర్, ఔరంగాబాద్, పర్బన్, నాందేడ్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతూ ఉండటంతో గోదావరి తీరంలోని ప్రాంతాలకు భారీ వరద ముప్పు పొంచివుందని అధికారులు వెల్లడించారు. దక్షిణ చత్తీస్ గఢ్ లోని వర్షాలకు ఇంద్రావతి నదికి భారీగా నీరు రానుందని, ఈ నీరు తెలంగాణలోని జయశంకర్, భద్రాద్రి, నిజామాబాద్ లతో పాటు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలకు వరద ముప్పు ఉందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో కర్ణాటకలోని బళ్లారి, శివమొగ్గ, బాగల్ కోట్, విజయపుర తదితర జిల్లాల్లో పడుతున్న వర్షాలకు కృష్ణ, తుంగ, భద్ర నదుల్లో నీరు క్రమంగా పెరుగుతోందని, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ఓ మోస్తరు వరద రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.