: దుమ్మురేపిన జీఎస్టీ వసూళ్లు.. తొలి నెలలో రూ.92 వేల కోట్లు.. లక్ష్యాన్ని దాటిపోయామన్న జైట్లీ
తొలి నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో రికార్డు నమోదైంది. ప్రభుత్వం రూ.91 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా జూలైలో ఏకంగా రూ. 92,200 కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం 59.57 లక్షలమంది రిజిస్టర్డ్ పన్ను చెల్లింపుదారుల్లో 38.38 లక్షల మంది ఇప్పటి వరకు జీఎస్టీ రిటర్న్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఆలస్యంగా పన్ను చెల్లించే వారికి రోజుకు రూ.100 చొప్పున లెవీ విధించనున్నట్టు మంత్రి హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.