: భార్య అంగీకారం లేకుండా శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా చూడొద్దు: హైకోర్టుకు కేంద్రం వినతి


భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా ఎందుకు పరిగణించకూడదన్న ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. దీనిపై కేంద్రం తన వాదన వినిపించింది. భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ దానిని నేరంగా పరిగణిస్తే వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు సూచించింది.

దీనిని నేరంగా పరిగణిస్తే భార్యలు భర్తలపై కక్ష సాధింపులు, వేధింపులకు ఆయుధంగా మార్చుకునే ప్రమాదం ఉందని కేంద్రం చెప్పింది. ఇందుకు ఐపీసీ సెక్షన్ 498(ఏ)ను ఉదాహరణగా చూపింది. ఈ విషయంలో ఎలాంటి సంక్లిష్టతకు తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోరింది. రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకుని, ఆ తరువాత దీనిపై స్పష్టతకు రావాలని సూచించింది. వైవాహిక రేప్ ను చట్టంలో నిర్వచించలేదని, దీనిని నిర్వచించేందుకు సమాజంలో విస్తృత ఏకాభిప్రాయం అవసరమని స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News