: తియ్యగా పలకరిస్తుంది.. పడిపోయారో మటాషే..!


తియ్యని గొంతు, సోషల్ మీడియాలో అందమైన పోస్టులు.. ఈ రెండింటిని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటూ యువకులను దోచేస్తున్న ఓ మాయలేడి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. మైసూరులోని అశోకపురానికి చెందిన యువతి మాలా ఫోన్లు, సోషల్ మీడియాను చక్కగా ఉపయోగించుకుంటూ యువకులతో పరిచయం పెంచుకుంటుంది. ఆమె మాటలకు ఆకర్షితులైన వారితో రోజు ఫోన్లో మాట్లాడుతుంది. చాట్ చేసి మత్తెక్కిస్తుంది. వారు పూర్తిగా తన వలలో చిక్కినట్టు భావించిన తర్వాత ప్లాన్ అమలు చేస్తుంది. వన్ ఫైన్ డే.. ఫలానా దగ్గర కలుసుకుందామని తన వలలో పడిన యువకుడికి ఆఫర్ ఇస్తుంది. నమ్మి వచ్చిన అతడిని తన ముఠాతో కాపుకాసే యువతి నిలువు దోపిడీ చేస్తుంది. మారణాయుధాలతో బెదిరించి అతడి దగ్గర ఉన్న డబ్బు, దస్కం దోచుకుంటుంది. ఆమె వలలో పడి మోసపోయిన ఓ యువకుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News