: భార్యకు తలాక్ చెప్పిన హైదరాబాదీ... నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు!


ముస్లిం మ‌హిళ‌ల జీవితాల‌ను నాశ‌నం చేస్తోన్న ట్రిపుల్‌ తలాక్‌ను ర‌ద్దు చేస్తూ సుప్రీంకోర్టు కొన్ని రోజుల ముందే తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ భార్య‌కు త‌లాక్ చెప్పాడు ఓ హైద‌రాబాదీ. మగ పిల్లాడి కోసం నగరంలోని ఛార్మినార్ లో బాబా వద్ద వైద్యం చేయించుకోవాల‌ని త‌న‌ భర్త హుస్సేన్‌ ఒత్తిడి తీసుకురావడంతో ఆ మ‌హిళ అత‌డి వ‌ద్ద‌కు వెళ్లింది. అయితే, ఆ బాబా ఆమె ప‌ట్ల‌ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె మళ్లీ ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. ఆమెకు ఇటీవ‌ల‌ ఆడపిల్ల పుట్టింది. దీంతో హుస్సేన్ ఆమెకు తలాక్ చెప్పాడు.

 దీంతో తన భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మ‌హిళ‌ భర్త, అత్త, మామ సహా ఎనిమిది మందిపై ఛార్మినార్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు నకిలీ బాబా సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మ‌హిళ భ‌ర్త హుస్సేన్‌ ప్రస్తుతం అబుదాబీలో ఉన్నాడు. అతనిని అరెస్టు చేసేందుకు లుకౌట్‌ నోటీసులు పంపారు. ఆయ‌న‌పై నిర్భ‌య చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

  • Loading...

More Telugu News