: ముగిసిన కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఐదు గంటలలోపు పోలింగ్ కేంద్రాల ముందు లైనులో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ రోజు సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ శాతం 61గా నమోదైంది. ఇక పోలింగ్ ముగిసిన సమయానికి మొత్తానికి 65 శాతం వరకు ఉండచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చేనెల 1న ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.