: ఇదిగో.. షారూక్ సతీమణి, నటీమణి కలసి దిగిన సెల్ఫీ!


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ సతీమణి, ఆయనతో పలు సినిమాల్లో నటించిన నటీమణి కలిసి దిగిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. షారూక్ సతీమణి గౌరీ ఖాన్, నటీమణి కాజోల్ కలిసి ఈ సెల్ఫీ దిగారు. ముంబయిలో నిన్న గౌరీఖాన్ డిజైన్ చేసిన షాపింగ్ మాల్ లో వీరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌరీతో కాజోల్ సెల్ఫీ దిగింది. ఈ ఫొటోను గౌరీఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘ఇది మా సెల్ఫీ.. ఈ సారి, అబ్ రామ్ ను కూడా ఈ స్టోర్ కు తీసుకువస్తా..’ అని తన పోస్ట్ లో ఆమె పేర్కొన్నారు. కాగా, షారూక్, కాజోల్ సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘దిల్ వాలే దుల్హానియా లేజాయాంగే’ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ముంబైలోని మరాఠా మందిర్ లో ఈ చిత్రాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తుండటమే ఇందుకు నిదర్శనం.

  • Loading...

More Telugu News