: నంద్యాల విజయం తర్వాత చంద్రబాబుకు ఫోన్ చేస్తే అలా అన్నారు: భూమా అఖిలప్రియ


నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ విజయం సాధించిన తర్వాత తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి మంత్రి అఖిలప్రియ ఫోన్ చేశారట. దీని గురించి ఆమె చెబుతూ ‘ఈ గెలుపుతో మన ఆశయం పూర్తయినట్టు కాదు. అభివృద్ధిలో నంద్యాలను ముందుకు తీసుకెళ్తెనే నాగిరెడ్డి ఆశయాన్ని పూర్తి చేసినట్టు. నాగిరెడ్డి కోరుకున్న అభివృద్ధి నంద్యాలలో కనిపిస్తోంది’ అని తనతో చంద్రబాబు చెప్పారని అఖిలప్రియ పేర్కొన్నారు. అమ్మానాన్నలు లేకుండా సాధించిన నంద్యాల విజయం వారిని ప్రతిక్షణం గుర్తు చేస్తుందని ఆమె అన్నారు. అమ్మానాన్న లేని బాధ ఏంటో దానిని అనుభవించిన వారికే తెలుస్తుందని, తన తండ్రి భూమా నాగిరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News