: రెండు కేసుల్లో బాబా రామ్ పాల్ ను నిర్దోషిగా తేల్చిన హిస్సార్ కోర్టు!


రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం, హింస‌కు కార‌ణం అవ్వ‌డం, 2006లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడుగా ఉండ‌డం వంటి కేసుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న బాబా రామ్ పాల్ కి ఈ రోజు హర్యానాలోని హిస్సార్ కోర్టులో కాస్త ఊర‌ట ల‌భించింది. మొత్తం 5 కేసుల్లో నిందితుడుగా ఉన్న ఆయ‌న రెండు కేసుల్లో నిర్దోష‌ని కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. దీంతో ఆయ‌న‌ మ‌రో మూడు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. ఆయా కేసుల్లో పలుసార్లు ఆయన కోర్టు నుంచి వచ్చిన నోటీసులను పట్టించుకోకుండా, కోర్టుకు హాజరుకాకుండా ఉండడంతో ఆయనను గతంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
 

  • Loading...

More Telugu News