: ‘రాజుగారి గది-2’ ఫస్ట్‌లుక్ మోషన్ పిక్చర్ విడుదల.. ‘హ్యాపీ బర్త్ డే మామా’ అన్న సమంత
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజుగారి గది-2’ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పిక్చర్ ఈ రోజు విడుదలైంది. నాగార్జున ఈ రోజు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా దీన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తనకు కాబోయే మామయ్య అక్కినేని నాగార్జునకి చెన్నై బ్యూటీ సమంత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో ‘రాజుగారి గది-2’ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పిక్చర్ ను పోస్ట్ చేసింది. అక్కినేని నాగార్జున నిజంగానే కింగ్ అని, తనని తాను ఎలా పరిపాలించుకోవాలో తన మామకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే, సంగీత దర్శకుడు థమన్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉందని పేర్కొంది. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమాను చూద్దామని చెప్పింది.