: నంద్యాలలో భూమా ఘన విజయం.. ఖమ్మంలో సంబరాలు!


నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించడంతో ఖమ్మం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఖమ్మం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సందడి చేశారు. ఈ సందర్భంగా టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కేక్ కట్ చేసి, అందరికీ స్వీట్లు పంచారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీకి ఘన విజయం కట్టబెట్టడం ద్వారా వైసీపీ అధినేత జగన్ కు నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఈ విజయం తమ అధినేత చంద్రబాబు పనితీరుకు నిదర్శనమని చెప్పారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబు పనితీరుకు అక్కడి ప్రజలు జై కొట్టారని అన్నారు. ఇదే సమయంలో వైసీపీ ఆగడాలను తిప్పికొట్టారని అన్నారు. నంద్యాల విజయం ప్రజావిజయం అని కొనియాడారు. 

  • Loading...

More Telugu News