: పిల్లలు కూడా 'ఏక్ పెగ్ లా' అంటున్నారు... భయమేస్తోంది!: పూరీ


ఈ వారంలో విడుదల కానున్న బాలకృష్ణ నూతన చిత్రం 'పైసా వసూల్'లో బాలయ్య స్వయంగా పాడిన 'మామా ఏక్ పెగ్ లా...' పాట సూపర్ డూపర్ హిట్టయ్యిందని చెప్పిన దర్శకుడు పూరీ జగన్నాథ్, ఇదే విషయం తనకు భయాన్ని కలిగిస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, "ఆయన పాడిన పాట 'మామా ఏక్ పెగ్ లా' ఈజ్ రాకింగ్. ఎక్కడ విన్నా అదే. పిల్లలు కూడా పాడేస్తున్నారు. ఇదో భయం నాకు. ఇన్నాళ్లూ బాలకృష్ణతో సినిమా చేయక మిస్ అయ్యాను. ఇప్పుడు షూటింగ్ అయిపోయాక, ఆయనతో కలిసుండే క్షణాలను మిస్ అవుతున్నాను. 'రామకృష్ణా థియేటర్ సందులో పెరిగాను. నాది నేల టికెట్ బ్యాచ్' అన్న డైలాగ్ నాకెంతో నచ్చింది" అని పూరీ జగన్నాథ్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News