: నిన్నటి నుంచీ ఏడుస్తూనే ఉన్న రేపిస్ట్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్


నిన్న తానున్న సోనారియా జైలులోనే ఏర్పాటు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టులో తీర్పును విన్న తరువాత మొదలైన డేరా సచ్చా సౌధా చీఫ్, రేపిస్ట్ గుర్మీత్ రామ్ రహీమ్ ఏడుపు ఇప్పటికీ ఆగలేదు. ఆయన నిన్నటి నుంచీ ఏడుస్తూనే ఉన్నాడని జైలు వర్గాలు తెలిపాయి. తాను నిరపరాధినని, క్షమించాలని కోరుతూ నిన్న న్యాయమూర్తిని వేడుకున్న గుర్మీత్, ఆపై బోనులోనే వెక్కి వెక్కి ఏడుస్తూ, అక్కడి నుంచి వెళ్లేందుకు అంగీకరించలేదన్న సంగతి తెలిసిందే.

గుర్మీత్ ను బలవంతంగా అక్కడి నుంచి బ్యారక్ లోకి తరలించిన జైలు అధికారులు, సాధారణ ఖైదీలు ధరించే దుస్తులను ఆయనకు అందించారు. వాటిని వేసుకునేందుకు చాలా సేపు నిరాకరించిన గుర్మీత్, ఆపై వాటిని ధరించి తనలో తాను కుమిలిపోతూ కనిపించాడని జైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గుర్మీత్ ఒక్కడినే ఓ చిన్న గదిలో ఉంచామని, తన భద్రతపై అతనికి ఆందోళన ఉందని, మైగ్రేన్, వెన్నునొప్పితో బాధపడుతూ ఉన్నాడని వెల్లడించారు. గుర్మీత్ కు కాపలాగా ఇద్దరు సీనియర్ అధికారులను నియమించామని, ఆయన జైలు గది పక్కన అనుక్షణం ఇద్దరు గార్డులు ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News