: బ్రేకింగ్ న్యూస్.... పట్టాలు తప్పిన దురంతో ఎక్స్ ప్రెస్.. పలువురికి గాయాలు!
వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులతో పాటు, రైల్వే శాఖను కూడా బెంబేలెత్తిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో పది రోజుల వ్యవధిలో రెండు రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా, తాజగా మహారాష్ట్రలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో గత పదిరోజుల్లో నాలుగు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజా ప్రమాదంలో నాగపూర్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ కల్యాణ్ లోని టిట్వాల స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో దురంతో రైలు ఇంజన్‌తో పాటు ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించాయి. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.