: 'నైట్‌రైడర్స్' తరపున బరిలోకి క్రిస్‌గేల్.. షారూఖ్ జట్టులో విధ్వంసకర ఆటగాడు!


విండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ నైట్‌రైడర్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. అయితే ఇక్కడో చిన్న విషయం చెప్పాలి. ఆయన ఆడబోతున్నది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కాదు.. కేప్‌టౌన్ నైట్‌రైడర్స్‌కు. దక్షిణాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ ఈ ఏడాది టీ20 గ్లోబల్ లీగ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కేప్‌టౌన్ నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ కొనుగోలు చేశాడు. ఈ జట్టులో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్, డుమినీ సహా పలువురు స్టార్ క్రికెటర్లు ఉన్నారు. నవంబరు 3న ప్రారంభమయ్యే టీ20 గ్లోబల్ లీగ్ డిసెంబరు 16న ముగుస్తుంది.

  • Loading...

More Telugu News