: శిల్పా! రాజకీయ సన్యాసం తీసుకో!: ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సలహా


నంద్యాల ఉపఎన్నికల ముందు ప్రకటించిన విధంగా శిల్పా మోహన్‌ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఏపీ మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సూచించారు. నంద్యాలలో ఆయన మాట్లాడుతూ, శిల్పా ఆడిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. శిల్పాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాజకీయ సన్యాసం తీసుకోవడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ అనుచిత వ్యాఖ్యలే తమకు లాభించాయని ఆయన అన్నారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భూమా కుటుంబంపై ప్రజలకు ఉన్న అభిమానాలే భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాయని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News