: మిస్ ఏషియా పసిఫిక్-2017గా 'గీతం' విద్యార్థిని!
హైదరాబాదులోని పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీ క్యాంపస్ లో ఇంజనీరింగ్ మూడో ఏడాది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యనభ్యసిస్తున్న జొన్నలగడ్డ మానస ‘మిస్ ఇండియా ఏసియా పసిఫిక్–2017’ టైటిల్ సాధించింది. దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయిలాండ్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన ఔత్సాహిక అందగత్తెలతో పోటీ పడిన మానస టైటిల్ సాధించడం విశేషం. థాయిలాండ్ లోని పట్టాయాలో ఈ పోటీలు జరిగాయని గీతం యూనివర్సిటీ వెల్లడించింది. తమ విద్యార్థిని టైటిల్ గెలుపొందడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.