: శశికళ ఆమోదంతోనే వీరిని పదవుల నుంచి తొలగిస్తున్నానన్న దినకరన్...అమ్మ నియమించిన వారిని తొలగించే అధికారం లేదన్న పళనిస్వామి!


తమిళనాట అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పార్టీ నుంచి రెండో సారి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ పలువురిని పార్టీ పదవుల నుంచి తొలగించారు. శశికళ ఆమోదంతోనే పార్టీని పునర్‌ వ్యవస్థీకరించానని అన్నారు. ఇందులో భాగంగా సీనియర్‌ నేతలతోపాటు, తనకు మద్దతుగా నిలవని సీనియర్‌ మంత్రులు పి.తంగమణి, ఎస్పీ వేలుమణి తదితర మంత్రులను సైతం పార్టీ పదవులనుంచి తప్పించారు. తిరుచిరాపల్లి నగర శాఖ కార్యదర్శి నటరాజన్‌, తిరుచిరాపల్లి శాఖ కార్యదర్శి రతినవేల్‌ వంటి వారిని సైతం తీసేశారు.

 ఈ మార్పులన్నీ శశికళ ఆమోదంతోనే చేశానని దినకరన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పళనిస్వామి చెబుతూ, పార్టీ పదవుల నుంచి శశికళ, దినకరన్‌ లను ఈ నెల పదో తేదీనే తొలగించామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దినకరన్ చేసిన మార్పులు చెల్లవని ఆయన తెలిపారు. అంతే కాకుండా జయలలిత హయాంలో జరిగిన నియామకాలను తొలగించే అధికారం ఆయనకు ఎంతమాత్రం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు తీర్మానం చేశారు. 

  • Loading...

More Telugu News