: ఒరాకిల్ లో 5,000 కొత్త ఉద్యోగాలు... సాఫ్ట్ వేర్ ప్రతిభావంతులకు శుభవార్త!
ప్రముఖ కంప్యూటర్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ సాఫ్ట్ వేర్ నిపుణులకు శుభవార్త వినిపించింది. సాఫ్ట్ వేర్ మల్టీనేషనల్ కంపెనీగా పేరుగాంచిన ఒరాకిల్, సేల్స్ ఫోర్స్ తో గట్టిపోటీకి సిద్ధమైంది. ఇందులో భాగంగా కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్టు తెలిపింది. సుమారు 5,000 మందికి పైగా సాఫ్ట్ వేర్ నిపుణులను క్లౌడ్ సాఫ్ట్ వేర్ బిజినెస్ లో విధులు నిర్వర్తించేందుకు తీసుకోనున్నట్టు తెలిపింది. సాఫ్ట్ వేర్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ రంగంలో సేల్స్ ఫోర్స్ ఇంక్ కు గట్టి పోటీ ఇవ్వాలని, ఈ రంగంలో విలువైన మార్కెట్ షేరును దక్కించుకోవాలని ఒరాకిల్ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
దీంతో ఈ తొలి త్రైమాసికంలో ఒరాకిల్ రెవెన్యూ 58 శాతం మేర పైకి ఎగిసింది. మరోవైపు అమెజాన్.కామ్ ఇంక్ కూడా లక్ష మంది సాఫ్ట్ వేర్ నిపుణులను నియమించుకోనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు యాపిల్ సాఫ్ట్ వేర్ కూడా ఈ రంగంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గిరాకీ పెరిగినట్టు తెలుస్తోంది.