: లారీ కింద పడి బైక్ నుజ్జునుజ్జయినప్పటికీ వాహనదారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.. వీడియో చూడండి!
చైనాలో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఓ యువకుడు వేగంగా బైకును నడుపుతూ వస్తున్నాడు. ఓ కూడలి వద్దకు వచ్చాక కూడా బైక్‌ని స్లో చేయలేదు. అదే సమయంలో మరో వైపు నుంచి ఓ లారీ వేగంగా వచ్చింది. ఒక్కసారిగా లారీ తనముందుకు రావడంతో వెంటనే తన బైక్‌ను జారవిడిచాడు. దీంతో ఆ బైకు లారీ కిందపడి నుజ్జునుజ్జు కాగా, ఆ యువకుడు క్షణాల వ్యవధిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం ఆ యువకుడు ఎంచక్కా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను మీరూ చూడండి...