: సారాహ్ యాప్‌తో డేంజరే!... ఫోన్ కాంటాక్టులను రహస్యంగా కాజేస్తుందంటున్న నిపుణులు
పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ మెసేజ్‌లు చేరవేసే యాప్ `సారాహ్`. ఎదుటివారు తమ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తితో చాలా మంది ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అయితే ఈ యాప్ వినియోగదారుడికి తెలియకుండా కొన్ని అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్స్టాల్ చేసుకున్న వారికి తెలియకుండా వారి స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్టులను ఈ యాప్ తస్కరిస్తోందని ఐటీ సెక్యూరిటీ కంపెనీ బిషాప్ ఫాక్స్‌లో అనలిస్ట్‌గా పనిచేసే జాకరీ జూలియన్ వెల్లడించాడు. కాంటాక్టులతో అవసరం లేకపోయినా ఈ యాప్ కాంటాక్టులను యాక్సెస్ చేసే అనుమతి కోరుతోందని ఆయన తెలిపారు. అయితే దీనికి సమాధానంగా యాప్ సృష్టికర్త జైన్ అల్ అబ్దీన్ తాఫీఖ్ స్పందిస్తూ - `ఫైండ్ యువర్ ఫ్రెండ్స్` సౌకర్యం పనిచేయడానికి కాంటాక్టుల వివరాలను యాక్సెస్ చేసే అనుమతి అవసరమని, అందుకోసమే సారాహ్ కాంటాక్టు పర్మిషన్ కోరుతుందని ట్విట్టర్లో వెల్లడించాడు.