: పవన్ కల్యాణ్ కన్నా ‘అర్జున్ రెడ్డి’ హీరో పది రెట్లు బెటర్: రామ్ గోపాల్ వర్మ


సినీన‌టుడు పవన్ కల్యాణ్ కన్నా ‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరో విజయ్ దేవరకొండ పది రెట్లు బెటరని వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు. చిన్న సినిమాగా వ‌చ్చిన‌ అర్జున్ రెడ్డి మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా ఆ సినిమాను మెచ్చుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు చేస్తున్నాడు. ఈ రోజు ఓ పెద్ద వ్యాస‌మే రాసుకొచ్చాడు. అందులోనే ఇలా ప‌వ‌న్‌ను దేవ‌ర‌కొండ‌తో పోల్చుతూ హెడ్డింగ్ పెట్టాడు. కాగా, లో బ‌డ్జెట్‌తో తీసిన‌ ఈ సినిమాలో ఎటువంటి పంచ్ డైలాగులూ లేకుండానే ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని వ‌ర్మ‌ అన్నాడు. ఈ సినిమా కోసం టాప్ టెక్నిషియ‌న్స్ కూడా ప‌నిచేయ‌లేద‌ని పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండ నేచురల్ గా నటించిన తీరు అద్భుతమని ప్రశంసల జల్లు కురిపించాడు. 

  • Loading...

More Telugu News