: శాంసంగ్ బాస్‌గా జే యాంగ్ లీ సోద‌రి... వ్యాపార నిర్వ‌హ‌ణ‌లో మంచి అనుభ‌వ‌మే కార‌ణం!


అవినీతి కేసులో నిందితుడిగా శాంసంగ్ వైస్ చైర్మ‌న్‌ జే యంగ్ లీకి జైలు శిక్ష ప‌డ‌టంతో ఆయ‌న స్థానంలో సోద‌రి లీ బూ జిన్ బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి ఎవ‌రో ఒక‌రు శాంసంగ్ పగ్గాలు చేప‌ట్టాల‌ని, ఆ స్థానాన్ని లీ బూ జిన్ మాత్ర‌మే భ‌ర్తీ చేయ‌గ‌ల‌ద‌ని కంపెనీ బోర్డు అభిప్రాయ‌ప‌డుతోంది. ఇప్పటి వరకు శాంసంగ్ ప్ర‌ధాన ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను పురుషులే నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. వారి స్థానంలో జిన్ శాంసంగ్‌ వ్యాపార సామ్రాజ్య పగ్గాలు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తిందని వారు భావిస్తున్నారు.

 ఇప్పటికే జిన్‌కు శామ్‌సంగ్‌ సి అండ్‌ టిలో 5.5 శాతం వాటా ఉంది. ప్ర‌స్తుతం శామ్‌సంగ్‌కు చెందిన 3.3 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యాపారాలను జిన్ నిర్వహిస్తున్నారు.  విలాసవంతమైన‌ హోటల్‌ షిల్లా, డ్యీటీ ఫ్రీ వ్యాపారాలను ఆమె చూసుకుంటున్నారు. ఆమె 2010లో వ్యాపార పగ్గాలు చేపట్టాక‌, ఆ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రెండింతలైంది. వ్యాపార నిర్వహణలో ఆమె త‌న స‌త్తాను రుజువు చేసుకోవ‌డంతో శాంసంగ్ ప‌గ్గాలు జిన్ ప‌రం చేసేందుకు బోర్డు మొగ్గు చూపుతోంది.

  • Loading...

More Telugu News