: నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై లక్ష్మీపార్వతి స్పందన


నంద్యాలలో జరిగింది కేవలం ఉప ఎన్నిక మాత్రమేనని... ఇవి సాధారణ ఎన్నికలు కాదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. ప్రభుత్వమే ఈ ఎన్నికలకు ఎక్కడా లేని ప్రచారం కల్పించిందని చెప్పారు. మూడున్నరేళ్ల పాలనలో ఎన్నడూ ఏ హామీని నిలబెట్టుకోని చంద్రబాబు... ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికే హడావుడిగా భారీ ఎత్తున పనులను చేపట్టారని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలకు తాను వ్యతిరేకం కాదని... అయితే, ఇప్పటికిప్పుడు పనులను చేపట్టడాన్నే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. నంద్యాల తప్ప రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికే వేరే ప్రాంతాలేవీ లేవా? అని ప్రశ్నించారు. గెలుపు కోసం టీడీపీ ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. 

  • Loading...

More Telugu News