: శిక్ష ఖరారు చేయగానే కన్నీరు పెట్టుకున్న గుర్మీత్ సింగ్.. కోర్టు హాలు నుంచి బయటకు వచ్చేందుకు ఒప్పుకోని డేరా బాబా!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా చీఫ్, రాక్‌స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కి ఈ రోజు రోహ్తక్ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో సీబీఐ న్యాయస్థానం శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. శిక్ష ప్రకటించగానే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం గుర్మీత్ బాబా ఆ కోర్టు హాలు నుంచి బయటకు రానంటే రానని పట్టుబట్టాడు. దీంతో ఆయనను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఆయనకు ప్రస్తుతం జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయనకు శిక్ష విధించినందుకు గానూ ఆయన అనుచరులు ఆందోళనలకు దిగుతున్నారు.