: దేశాభిమానాన్ని పెంపొందించే సంగీత కార్యక్రమాలు నిర్వహించండి... యూనివర్సిటీలకు మానవ వనరుల శాఖ ఆదేశం
`యే హై ఇండియా కా టైమ్` కార్యక్రమంలో భాగంగా ఐఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థుల్లో స్వదేశాభిమానాన్ని పెంపొందించే సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని మానవ వనరుల శాఖ ఆదేశించింది. దేశంలోని వివిధ యూనివర్సిటీలు సందర్శించి ప్రదర్శనలు ఇచ్చేందుకు కొన్ని బృందాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ బృందాలు ఆయా యూనివర్సిటీల్లో దేశభక్తి పాటలు పాడి, విద్యార్థుల్లో దేశాభిమానం పెంపొందడానికి తోడ్పడుతారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు, క్విట్ ఇండియా ఉద్యమం చేసి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెల మొత్తం ఈ బృందాలు వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో సంగీత ప్రదర్శనలివ్వనున్నాయి.