: నంద్యాలలో చంద్రబాబుది విజయం అనుకుంటే పొరపాటే!: జగన్
నంద్యాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది విజయం అనుకుంటే పొరపాటేనని, ఇది దిగజారుడు రాజకీయం మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో హామీలిచ్చి, గెలిచాక మోసం చేయడం చంద్రబాబుకి అలావాటేనని చెప్పారు. నంద్యాలలో చంద్రబాబు రూ.200 కోట్లు ఖర్చు చేశారని జగన్ ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నిక 2019 ఎన్నికలకు రెఫరెండం కాదని వ్యాఖ్యానించారు. నంద్యాలలోనే మంత్రులందరినీ ఉంచి, చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేశారని అన్నారు. తమ సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తామని ఉద్ఘాటించారు. ప్రజలు భయపడే టీడీపీకి ఓట్లు వేశారని ఆరోపించారు.