: ఐపీఎల్ ప్రసార హక్కుల ఈ-వేలం పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
వచ్చే ఐదేళ్లకు సంబంధించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కులను ఈ-వేలం ద్వారా కేటాయించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వినోద్ రాయ్ నేతృత్వంలో కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఈ-వేలం ప్రక్రియకు విముఖత తెలియజేసింది. ప్రసార హక్కులను సాధారణ వేలం ద్వారా జారీ చేయడమే లాభదాయకమని కమిటీ సూచించింది. ఈ-వేలం ద్వారా ప్రసార హక్కులను జారీ చేయడం వల్ల బీసీసీఐకి రూ. 360-700 కోట్ల వరకు నష్టం వస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.