: బీజేపీ ర్యాలీ భగ్నం.. నేతల అరెస్ట్


కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాల పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. బాగ్ లింగం పల్లి నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, దత్తాత్రేయ తదితరులను అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం మాఫియా సర్కారులా మారిందన్నారు. యూపీఏ పాలనా కాలంలో జరిగినన్ని కుంభకోణాలు దేశ చరిత్రలోనే లేవని చెప్పారు. ప్రతీ కుంభకోణంలోనూ ప్రధాని, సోనియాకు వాటాలు దక్కాయని ఆరోపించారు. చైనా, పాక్ చర్యలకు తగిన సమాధానం చెప్పలేని అసమర్థ ప్రధాని మన్మోహన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News