: త్వరలో రూ. వెయ్యి నోటు రీ ఎంట్రీ?
పెద్ద నోట్ల రద్దులో భాగంగా రద్దైన రూ. వెయ్యి నోటు తిరిగి కొత్త అవతారంలో, మరింత సెక్యూరిటీతో చలామణిలోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ముద్రణను కూడా త్వరలో ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నోటుకు సంబంధించిన డిజైన్, ముద్రించడానికి ఉపయోగించాల్సిన పేపర్‌పై నిర్ణయం తీసుకున్నట్లు విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లోగా ఈ నోటును విడుదల చేయనున్నట్లు వారు వెల్లడిస్తున్నారు. రూ. 500, రూ. 2000 నోట్లు ఉన్నా రూ. 1000 లేక పోవడం వల్ల వినియోగంలో భాగంగా డబ్బు చేతులు మారుతున్నపుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అందుకే రూ. 1000 నోటు ముద్రణకు ప్రభుత్వం అంగీకరించినట్లు బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల తక్కువ మారకాలైన రూ. 200, రూ. 50 నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే.