: విజయ సంకేతాన్ని ప్రదర్శించిన చంద్రబాబు.. బాబు నివాసం ఎదుట టీడీపీ శ్రేణుల సంబరాలు


నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో... టీడీపీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. ఇటు నంద్యాలలోనే కాకుండా, అటు విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన నివాసం వద్ద విక్టరీ సింబల్ ను చూపిస్తూ, ఎన్నికలో విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. 12వ రౌండ్ ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి దాదాపు 22 వేల మెజార్టీని సాధించారు. 

  • Loading...

More Telugu News